Home  »  TV News  »  రాహుల్-స్వప్నల భాగోతం బయటపడినట్లేనా!

Updated : May 2, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -84 లో.. కావ్య, రాజ్ లు  మౌనవ్రతం చేస్తుంటారు. ఇద్దరు ఒకరికొకరు గిల్లికజ్జాలతో మాట్లాడుకోకుండానే చేష్టలతోనే గొడవపడుతుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి స్వప్న ఎవరితో లేచిపోయిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. రాహుల్ కి స్వప్న కాల్ చేసి వాళ్ళింటి దగ్గర ఉన్న కాఫీ షాప్ లో కలుద్దామని అంటుంది. ఇంట్లో ఫ్రెండ్ ని కలిసి వస్తానని స్వప్న కనకంకి చెప్తే.. కనకం మొదట వద్దని చెప్తుంది. ఆ తర్వాత స్వప్నతో పాటు అప్పుని తోడుగా పంపిస్తుంది కనకం. 

మరొకవైపు రాజ్, సుభాష్ ఇద్దరు కంపెనీ విషయాల గురించి మాట్లాడుకుంటారు. రాజ్-కావ్యలకు పంతులు బ్రహ్మముడి వెయ్యడంతో.. వాళ్ళు పక్క పక్కన కూర్చొని ఉంటారు. వీళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేసి.. అపర్ణ గదిలోకి పంపించాలి.. ఇష్టం లేని కోడలు తన గదిలోకి వెళ్తే  మళ్ళీ అపర్ణ గొడవచేస్తుందని  రుద్రాణి కావాలనే టీవీ వాల్యూమ్ పెంచుతుంది. ఇక ఆ సండ్ తట్టుకోలేక డిస్టర్బ్ గా ఉంది రాజ్.. మా గదిలోకి వెళ్లి డిస్కస్ చేసుకుందామని వెళ్తుండగా.. మీరు వెళ్ళండి తను ఎందుకని అపర్ణ అంటుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మముడితో ఉన్నారు.. తను కూడా రాజ్ పక్కన ఉండాలని సుభాష్ అంటాడు. ఇక అపర్ణ గదిలోకి ముగ్గురు వెళ్ళి.. కంపెనీ విషయాలు మాట్లాడుకుంటారు. మరొకవైపు స్వప్న, అప్పు కాఫీ షాప్ కి వెళ్తారు. అక్కడ కాసేపటికి.. నాకు పని ఉందని అప్పు చెప్తే.. స్వప్న సరే అనడంతో అప్పు వెళ్తుంది. ఆ తర్వాత కాఫీ షాపులో రాహుల్ కోసం ఎదురు చూస్తుంది స్వప్న. అప్పు, కళ్యాణ్ కోసం వెయిట్ చేసి.. కళ్యాణ్ రాగానే‌‌ ఇద్దరు కలిసి చాటుగా స్వప్నని చూస్తుంటారు. తను ఎవరిని కలవడానికి వచ్చిందో తెలుసుకుందామని తననే గమనిస్తుంటారు. అప్పుడే స్వప్నని కలవడానికి రాహుల్ రావడం చూసిన అప్పు, కళ్యాణ్ లు షాక్ అవుతారు. ఏంటీ స్వప్నని లేపుకెళ్ళింది రాహులా.. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఎలా ఉంటుందోనని కళ్యాణ్ అనగానే.. నువ్వు వచ్చిన పని చూడు.. ముందు ఇదంతా కెమెరాలో రికార్డు చెయమని అప్పు అనగానే.. స్వప్న రాహుల్ ఇద్దరు మాట్లాడుకునేదంతా వీడియో తీస్తాడు కళ్యాణ్. ఏంటీ ఇంత అర్జెంటు గా కలవాలన్నావని రాహుల్ అనగానే.. స్వప్న కోపంతో.. నా సిచువేషన్ గురించి తెలిసి కూడా ఏం పట్టనట్టున్నావని అంటుంది.

మరొకవైపు రాజ్ మౌనవ్రతంతో ఇబ్బంది పడతాడు. రాజ్ వాష్ రూమ్ కి వెళ్ళాలని చెప్పినా.. కావ్య కావాలనే బెట్టు చేస్తూ కూర్చున్న దగ్గర నుండి లేవదు. ఇక రాజ్ బాబాయ్ వచ్చి వెళ్ళండని అనగానే రాజ్ పరుగున వెళ్లిపోతాడు. అదంతా చూస్తున్న అపర్ణ.. కావ్య వైపు కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.